: రాజధాని కమిటీలో సభ్యుడిగా ఉండనని చంద్రబాబుకు చెప్పా: కేఈ
ఆంధ్రప్రదేశ్ రాజధాని కమిటీలో సభ్యుడిగా ఉండనని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పానని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రాజధానిపై పూర్తి స్పష్టత వచ్చేందుకు రెండేళ్ల సమయం పడుతుందని... రైతులను సంతృప్తిపరచి భూసేకరణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. రైతుల డిమాండ్లు కూడా సానుకూలంగానే ఉన్నాయని... బలవంతంగా భూములు లాక్కోమని స్పష్టం చేశారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలను మెట్రో సిటీలుగా మారుస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక తరహాలో రెవెన్యూ శాఖలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులకు నెలకు రూ. 2 వేల పింఛను ఇస్తామని తెలిపారు.