: శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్


సినీ నటుడు నారా రోహిత్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్నారు. నారా రోహిత్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం, రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News