: 14 నెలల తర్వాత సొంతూరుకు చేరిన మృతదేహం


చనిపోయిన 14 నెలల తర్వాత అతడి మృతదేహం స్వగ్రామానికి చేరింది. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన కుమ్మరి భాస్కర్ ఓ ఏజెంటు మాటలను నమ్మి సౌదీ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత కానీ ఏజెంట్ ఇచ్చింది కంపెనీ వీసా కాదని తెలియలేదు. దీంతో, సౌదీ నుంచి తిరిగి రావడానికి భాస్కర్ విశ్వ ప్రయత్నం చేసినా వీలుకాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన భాస్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి మరణవార్త విన్న కుటుంబీకులు భాస్కర్ ను కడసారి చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో, 14 నెలల తర్వాత భాస్కర్ మృతదేహం క్యాసంపల్లికి చేరుకుంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

  • Loading...

More Telugu News