: బంజారాహిల్స్ లో బెంబేలెత్తించిన ఆడీ కారు
శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.3లో ఓ ఆడీ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు రెండు బైక్ లను ఢీకొట్టి, ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. కారులో ఓ యువతి, యువకుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిద్దరూ కారును వదిలేసి పరారయ్యారని వెల్లడించారు. వీరు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది.