: టీఎస్ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మొగ్గు?
శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికారపక్షం కొమ్ము కాస్తున్నారని... విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని టీటీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, స్పీకర్ వ్యవహారశైలిని నిరసిస్తూ, ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచనలో టీటీడీపీ నేతలున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పై కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం వరకు వెళుతుందని చెప్పలేం. ఈ క్రమంలో, ఒక్క టీడీపీ మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని పెడితే పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. టీడీపీకి జతగా విపక్ష పార్టీలన్నీ కలిస్తే మాత్రం స్పీకర్ కు, టీఆర్ఎస్ కు ఇబ్బంది తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.