: చంద్రబాబుకు ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టారు: హరీష్ రావు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్టీఆర్ రాజకీయభిక్ష పెట్టారంటున్న చంద్రబాబుకు ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టారని టీఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపిన చంద్రబాబు... ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఒడ్డున కూర్చొని ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వ్యవహారం గుడ్డి కొంగ చెరువు ఒడ్డున కూర్చొని జపం చేసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు పక్కన కూర్చొని టీఎస్ శాసనసభ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీఎస్ అసెంబ్లీలో తీర్మానం చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News