: మహారాష్ట్ర మంత్రి వర్గంలోకి శివసేన: మంత్రి చంద్రకాంత్ పాటిల్
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరనుందని ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరుకల్లా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అన్నారు. మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో శివసేనకు అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే మూడో వంతు మంత్రి పదవులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని శివసేన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ, శివసేనను మంత్రి వర్గంలోకి తీసుకోవడం తదితర అంశాలపై పార్జీ జాతీయ అధ్యక్షుడితో చర్చించేందుకు సీఎం ఫడ్నవిస్ ఢిల్లీ వెళ్లారు.