: హైదరాబాద్ చింతల్ లో విషవాయువులు లీక్
హైదరాబాదులోని చింతల్ పారిశ్రామిక ప్రాంతంలోని భరత్ నగర్ లో జనావాసాల మధ్య విషవాయవులు లీకయ్యాయి. గంట సేపు విషవాయవులు లీక్ కావడంతో స్థానికులు ఊపిరి పీల్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళ్లు మంటలు, విపరీతమైన దగ్గు, తుమ్ములతో స్థానికులు ఆసుపత్రి పాలయ్యారు. విష రసాయన వాయువులు ఎక్కడి నుంచి విడుదలయ్యాయో తెలియక స్ధానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.