: రాజ్యసభకు ఇద్దరు కేంద్రమంత్రుల నామినేషన్
ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ లు దాఖలు చేశారు. బీజేపీ తరపున హర్యానా నుంచి సురేష్ ప్రభు, బీరేందర్ సింగ్ లు నామినేషన్లు దాఖలు చేశారు. సురేష్ ప్రభు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, బీరేందర్ సింగ్ హర్యానాకు చెందిన వ్యక్తే. మోదీ మంత్రి వర్గ విస్తరణలో వీరిద్దరూ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.