: సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మిస్తా: కేసీఆర్


హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ జలాల ప్రక్షాళనపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన హుస్సేన్ సాగర్ జలాల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. సాగర్ లోకి వచ్చే మురుగు నీరును నాలాల ద్వారా దారి మళ్లించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల 100 ఎకరాల విస్తీర్ణంలో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. నాలాల మళ్లింపుకు 100 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందిరా పార్కులో వినాయక నిమజ్జనానికి వినాయకసాగర్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. సంజీవయ్య పార్కులో నిర్మించనున్న అత్యంత ఎత్తైన టవర్ విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News