: 'హుదూద్' దెబ్బకి రద్దయిన వన్డే టికెట్ల సొమ్ము వాపస్


'హుదూద్' తుపాను కారణంగా గతనెలలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య విశాఖపట్టణంలో జరగాల్సిన వన్డే మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. తమ అభిమాన క్రీడాకారుల ఆటతీరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు టికెట్లు తీసుకున్నారు. ఆ మ్యాచ్ రద్దయిన కారణంగా టికెట్లు తీసుకున్న వారికి డబ్బును వాపస్ చేయనున్నారు. రేపు (ఆదివారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖలోని పోతిన మల్లయ్య పాలెంలో ఉన్న ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద టికెట్ తీసుకెళ్లి నగదును పొందవచ్చు.

  • Loading...

More Telugu News