: ఎల్లుండి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు...పార్టీలన్నీ బిజీబిజీ


పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ అంతర్గత చర్చల్లో బిజీబిజీగా గడుపుతున్నాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలా? అని ప్రతిపక్షాలు ఆలోచిస్తుండగా, ప్రతిపక్షాలకు ఎలా కళ్లెం వేయాలా? అని అధికార పార్టీ ముఖ్యులు మీటింగుల్లో గడుపుతున్నారు. శీతాకాల సమావేశాల సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. యూపీఏ హయాంలో పెండింగులో ఉన్న బిల్లులను పాస్ చేయించాలని పీఎంవో యోచిస్తోంది. వాటిపై దృష్టి సారించాలని ప్రధాని గతంలో మంత్రులకు సూచించారు. బడ్జెట్ లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండడంతో మన విదేశీ పెట్టుబడుల విధానాలపై ప్రభుత్వం కీలకనిర్ణయాలు తీసుకోనుందని పలువురు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి సోమవారం ఎంపీల్లో ఉత్కంఠను రేపుతోంది.

  • Loading...

More Telugu News