: ఇది పాత టీం కాదు...టీమిండియా గెలుపుపై రవిశాస్త్రి ధీమా
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో విజయం సాధిస్తుందని భారత క్రికెట్ జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆస్ట్రేలియా బయల్దేరిందని అన్నారు. జట్టుతో పాటు ధోనీ లేకపోయినా ఫర్వాలేదని, శ్రీలంక పర్యటనతో కోహ్లీ కెప్టెన్ గా రుజువు చేసుకున్నాడని అన్నారు. ఇప్పుడున్న టీమిండియా జట్టు గతంలో లాంటిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టుగా రాణించేందుకు 18 మందీ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అనుభవం లేకున్నా నాణ్యమైన ఆటగాళ్లు భారత్ సొంతమని ఆయన స్పష్టం చేశారు. ఆసీస్ పర్యటనలో టీమిండియా సత్తా చాటుతుందని ఆయన వివరించారు.