: మోదీకి తమిళ నటుడు విజయ్ లేఖ
శ్రీలంకలో ఉరిశిక్షపడ్డ తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్ల అంశంలో జోక్యం చేసుకుని విడుదల చేయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళ నటుడు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పీఎంకు ఆయన లేఖ రాశారు. జాలర్లను వెనక్కు రప్పించేందుకు పీఎం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. జాలర్లు సొంత రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా తమిళనాడు ఓ పండుగలా జరుపుకుందని విజయ్ పేర్కొన్నారు.