: మెరుగు పెడతామన్నారు... బంగారంతో ఉడాయించారు


గుంటూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. చిలకలూరిపేట సీఆర్ కాలనీలో ఓ ఇంటికి బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు యువకులు వచ్చారు. అక్కడే మెరుగు పెడతామని చెప్పి కుటుంబ సభ్యులు పనిలో ఉండగా ఇద్దరూ 15.5 సవర్ల బంగారం తీసుకుని ఉడాయించారు. దీనిని గుర్తించిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News