: మెట్రో రైల్ ఆదాయవనరుగా వాణిజ్య ప్రకటనలు...ఇకపై బోగీలన్నీ యాడ్ల మయమే!


ప్రతిష్ఠాత్మక ఢిల్లీ మెట్రోకు ప్రధాన ఆదాయ వనరుగా యాడ్స్ మారనున్నాయి. ప్రభుత్వ రంగ వాహనాల్లో ప్రైవేటు యాడ్లకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు అంగీకరించవు. కానీ ఢిల్లీ మెట్రోకు టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం సరిపోవడం లేదు. దీంతో ఇతర ఆదాయవనరుల సమీకరణాలవైపు ఢిల్లీ మెట్రో చూస్తోంది. అందులో భాగంగా రైలు బోగీల బయటి భాగంలో ప్రైవేటు యాడ్లను ముద్రించి సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఒకే ఒక్క రైలు మీదే ఈ ప్రయోగం చేస్తున్నారు. ద్వారక, వైశాలి స్టేషన్ల మధ్య ఈ బ్లూలైన్ రైలు ఆరు బోగీలతో ప్రతి ఉదయం 11 గంటలకు నడుస్తుంది. అలాగే యమునా బ్యాంక్, నోయిడా సిటీ స్టేషన్ల మధ్య ఓ కొత్త రైలును ఢిల్లీ మెట్రో ట్రయల్ రన్ నిర్వహించింది. డిసెంబర్ నెలాఖరుకల్లా మరో 15 ఇలాంటి రైళ్లను ప్రవేశపెట్టనున్నామని ఢిల్లీ మెట్రో అధికారులు వెల్లడించారు. కాగా, ఢిల్లీ మెట్రోలో 200 రైళ్లు తిరుగుతున్నాయి. రైళ్లలో యాడ్స్ ప్రయోగం సక్సెస్ అయితే రైల్వేలకు ఆదాయమే ఆదాయం.

  • Loading...

More Telugu News