: బస్సును హైజాక్ చేసి, 28 మందిని హతమార్చారు
కెన్యాలో తీవ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమాలియాకు చెందిన వంద మంది అల్ షబాబ్ తీవ్రవాదులు గ్రూపుగా ఏర్పడి, కెన్యాలో నైరోబీ బస్సును హైజాక్ చేశారు. ప్రయాణికుల్లా బస్సెక్కిన తీవ్రవాదులు బస్సును కొంత దూరం తీసుకువెళ్లి ఆపేశారు. తరువాత బస్సునుంచి ప్రయాణికులను కిందికి దింపి 'మీలో సోమాలియా ప్రాంతానికి చెందిన వారెవరు? సోమాలియేతర ప్రాంతానికి చెందిన వారెవరు?' అంటూ ప్రశ్నించి, వారిని రెండు గ్రూపులుగా విడగొట్టి కాల్పులకు తెగబడ్డారు. వారిలో 28 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అధిక సంఖ్యలో గాయపడ్డారు.