: కాశ్మీర్ నుంచి 'నైపుణ్య భారత్': మోదీ
దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చే క్రమంలో వేయనున్న ముఖ్యమైన అడుగు 'నైపుణ్య భారత్' కార్యక్రమాన్ని కాశ్మీర్ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ "పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలు ఓట్లు వేయాలి. జమ్మూ, కాశ్మీరు ప్రాంతాల కోసం వాజ్ పేయి కన్న కలలను నేను నిజం చేస్తా. భారత్ కు స్వాతంత్రం వచ్చిన తరువాత తొలిసారిగా రాజకీయ గాలుల దిశ మారింది. ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది" అన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని, మత రాజకీయాలకు చోటు కల్పించవద్దని మోదీ పిలుపునిచ్చారు.