: కాశ్మీర్ అభివృద్ధే నా లక్ష్యం: మోదీ


అందమైన కాశ్మీరు ప్రాంతం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టేలా చేయటం తన లక్ష్యమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి మధ్యాహ్నం కిష్టావర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. గడచిన 10 సంవత్సరాలలో అభివృద్ధిపరంగా కాశ్మీర్ వెనుకబడిందని, ఇక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నెలకోసారి ఇక్కడికి వస్తున్నానని గుర్తు చేశారు. కాశ్మీర్లో ఇప్పటిదాకా సాగిన వంశపారంపర్య పాలన నుంచి విముక్తి కల్పిస్తామని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News