: శివసేన మిత్రపక్షమే అంటున్న బీజేపీ
మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం మిత్రబంధాన్ని తెంచుకున్న శివసేన, బీజేపీ పార్టీలు తిరిగి కలవబోతున్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే శివసేనతో చెలిమి చేయాలనే బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శివసేనతో తమకు శత్రుత్వం లేదని అంటూ 'మేము ఎప్పటికీ స్నేహితులమే. భవిష్యత్తుల్లో కూడా మిత్రులుగా కొనసాగే అవకాశం ఉంది' అని ఫడ్నవీస్ అన్నారు. శివసేనతో చర్చల విషయంలో తాము సున్నితంగానే వ్యవహరిస్తామని, రాష్ట్ర స్థాయిలో కొన్ని విభేదాలు ఉన్నా కేంద్రంలో తాము కలిసే పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ అన్నారు. ఇదంతా చూస్తుంటే, ఒకవేళ మహా సర్కారుకు పవార్ మద్దతు ఉపసంహరించుకుంటే ఆ వెంటనే శివసేన మేమున్నామంటూ వచ్చి చేరుతుందేమో!