: 'యాహూ' మోసగాడిని పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసులు
యాహూ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు అంజాద్ పర్వేద్ విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. నిరుద్యోగుల నుంచి సుమారు రూ.30 కోట్లకు పైగా అంజాద్ వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు సైతం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.