: కర్ణాటకలో నేడు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
కర్ణాటక రాష్ట్ర విధాన సభకు మే 5న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిపోగా.. వీటిని ఈ రోజు ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. మొత్తం 2295 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 1051 మంది స్వతంత్ర అభ్యర్థులే. వీటి ఉపసంహరణకు ఈ నెల 20 వరకూ గడువు ఉంది.