: మోత్కుపల్లి దీక్షకు చంద్రబాబు సంఘీభావం
ఎన్టీఆర్ ఘాట్ వద్ద టి.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అంతకుముందు ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు బాబు నివాళులర్పించారు. అటు దీక్ష జరుగుతున్న ప్రదేశానికి పలువురు ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. శంషాబాద్ దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు తొలగించాలంటూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మోత్కుపల్లి ఈ దీక్ష చేస్తున్నారు.