: 'విక్రమసింహ' ప్రదర్శనకు హాజరుకాని రజనీకాంత్
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో కొచ్చాడయాన్ (తెలుగులో విక్రమసింహ) ప్రదర్శిస్తుంటే రజనీకాంత్ హాజరు కాలేదని తెలిసింది. ఐఎఫ్ఎఫ్ఐ ప్రారంభసభలో రజనీ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో వచ్చిన కొచ్చాడయాన్ గత మే నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర అపజయం పాలైంది. సౌత్ సూపర్ స్టార్ గోవాలో ఉండి కూడా తన చిత్రం ప్రదర్శిస్తుంటే రాకపోవటం వెనుక మర్మమేమిటో!