: అక్కడ టీడీపీ...ఇక్కడ కాంగ్రెస్!: డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరుపై పోటాపోటీ నిరసనలు
శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు అంశంపై శనివారం టీడీపీ, కాంగ్రెస్ లు పోటాపోటీ నిరసనలకు దిగాయి. ఎన్టీఆర్ ను అవమానపరిచే రీతిలో మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే, వెంటనే ఎన్టీఆర్ పేరును తొలగించాలని కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఎన్టీఆర్ ఘాట్ లో మోత్కుపల్లి దీక్షకు దిగితే, బేగంపేట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వి.హన్మంతరావు నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన చేపట్టింది. డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును తొలగించే దాకా నిరసనను విరమించేది లేదని వీహెచ్ ప్రకటించారు. మరోవైపు మోత్కుపల్లి దీక్షకు ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సంఘీభావం ప్రకటించనున్నారు.