: టోల్ గేట్ సిబ్బందిపై సమాజ్ వాదీ ఎమ్మెల్యే అనుచరుల దాడి


ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల ఆర్భాటం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసన ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అధినేత జన్మదిన వేడుకల సంబరాల్లో మునిగిపోయిన పార్టీ ఎమ్మల్యే అభయ్ సింగ్ అనుచరులు శుక్రవారం పట్ట పగలు టోల్ గేట్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. రాంగ్ రూట్ లో వస్తున్నారని ప్రశ్నించిన టోల్ గేట్ సిబ్బందిపై వారు జరిపిన దాడి దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రసారమవడంతో ఆ పార్టీ ఇరుకున పడింది. బారాబంకీలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా కేసు కూడా నమోదు చేయకపోవడం విశేషం!

  • Loading...

More Telugu News