: ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరిన టీమిండియా
ఆస్ట్రేలియాలో డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనేందుకు 18 మంది సభ్యుల టీమిండియా బృందం నేటి ఉదయం పయనమైంది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ ధోని కుడి చేతి బొటన వేలికి గాయం కావడంతో, ఈ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగగా, ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్ డే సిరీస్ లో కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు అద్భుత రీతిలో రాణించి విజయం సాధించగా, అదే ఉత్సాహంతో ఆస్ట్రేలియాలో సైతం గెలుస్తామనే ధీమాను కోహ్లి వ్యక్తం చేశాడు. రెండు దేశాల మధ్య తొలి టెస్టు మ్యాచ్ బ్రిస్బేన్ లో డిసెంబర్ 4న ప్రారంభం కానుంది.