: రాజ్యసభ టికెట్లు ఇవ్వడంలో కూడా చంద్రబాబుది వ్యాపారమే: తలసాని
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఓ అబద్ధాలకోరు అని... ఏనాడూ మాట మీద నిలబడ్డ వ్యక్తి కాదని దుయ్యబట్టారు. రాజ్యసభ టికెట్లు ఇవ్వడంలో, ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించడంలో చంద్రబాబుది అంతా వ్యాపారమే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు గుంజారన్న జాబితా తన వద్ద ఉందని చెప్పారు. సొంత పార్టీ ఎంపీని కూడా వారు వదల్లేదని ఆరోపించారు. ఈ వివరాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి, బ్లాక్ మెయిల్ చేసే వారి కనుసన్నల్లో టీడీపీ నడుస్తోందని విమర్శించారు.