: హుదూద్ ను తీవ్రమైన తుపానుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


ఉత్తరాంధ్రను వణికించి, విశాఖను అతలాకుతలం చేసిన హుదూద్ తుపానును తీవ్రమైన తుపానుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హుదూద్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబుతో పాటు వివిధ పక్షాలకు చెందిన నేతలందరూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంలో మరింత చొరవ తీసుకుని హుదూద్ ను తీవ్ర తుపానుగా ప్రకటించేలా చేశారు. ఈ నిర్ణయంతో, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ తమ నిధుల నుంచి కోటి రూపాయల వరకు తుపాను బాధితుల సహాయార్థం కేటాయించే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News