: కేంద్రం సాయంతో ఏపీకి అద్భుత రాజధాని: సుజనా చౌదరి
కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని అద్భుత రీతిలో నిర్మించుకుంటామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడితో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిశామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చలు జరిపామని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించాల్సిన రాయితీలపైనా చర్చించామన్నారు. డిసెంబర్ చివరి నాటికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని హామీలను రాబట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హామీల తక్షణ అమలు కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరామని ఆయన వెల్లడించారు.