: శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్న తెలంగాణ


శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తిని శనివారం కూడా కొనసాగిస్తోంది. 300 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్న తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (తెలంగాణ జెన్ కో) 15 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ లో 855.70 అడుగుల నీటి మట్టం ఉంది. గత కొన్ని రోజులుగా ఏపీ అభ్యంతరాలను తోసిరాజని శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News