: ప్రభుత్వంతో జూడాల చర్చలు విఫలం... ఏపీలో నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె


గ్రామీణ వైద్య సేవలపై జూనియర్ డాక్టర్లు ఏపీ ప్రభుత్వంతో శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేటి నుంచి జూడాలు తిరిగి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల ప్రథమార్థంలో సమ్మెకు దిగిన జూడాలతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జరిపిన చర్చలు ఫలించి, సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. మిగిలిన అన్ని డిమాండ్లపై ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినా, గ్రామీణ సేవలపై మాత్రం ఓ అంగీకారం కుదరలేదు. దీనిపై సీఎం చంద్రబాబుతో సమావేశానికి జూడాలు సహా మంత్రి కామినేని కూడా అంగీకరించారు. అయితే శుక్రవారం ఇరువర్గాల మధ్య జరిగిన చర్చల్లో గ్రామీణ సేవలపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది. దీంతో నేటి నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు జూడాలు నిర్ణయించారు. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News