: మావోల కాల్పుల్లో ఏడుగురు జవాన్లకు గాయాలు
ఛత్తీస్ గఢ్ అడవుల్లో శుక్రవారం రాత్రి మావోయిస్టులు జరిపిన దాడిలో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. రాష్ట్రంలోని సుకుమా జిల్లా చింతగుప అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా బలగాలపై మావోలు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు జావాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలపై మెరుపు దాడి చేసిన మావోయిస్టులు కూంబింగ్ లో పాల్గొన్న భారత సైనిక హెలికాఫ్టర్ పై కూడా కాల్పులకు దిగారు. ఈ దాడిలో హెలికాఫ్టర్ లోని ఓ జవాన్ కు కూడా గాయాలయ్యాయి.