: విశాఖలో ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బలి
విశాఖలో ర్యాగింగ్ భూతం ఓ విద్యార్థిని పొట్టనబెట్టుకుంది. భీమిలి ఎన్నారై కళాశాలలో నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ తో తీవ్ర మనస్థాపానికి గురైన ఫార్మసీ విద్యార్ధి ప్రశాంత్ నాలుగు రోజుల క్రితం భవనంపై నుంచి దూకాడు. దీంతో గాయాలపాలైన ప్రశాంత్ ను నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అయితే నాలుగు రోజులుగా చికిత్స అందించినా కోలుకోని ప్రశాంత్ శనివారం మరణించాడు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భీమిలి పీఎస్ లో ర్యాగింగ్ కేసు నమోదైంది.