: డిసెంబర్ 8 నుంచి పాలమూరులో షర్మిళ పరామర్శ యాత్ర


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ తెలంగాణలో చేబట్టే పరామర్శ యాత్ర డిసెంబర్ 8 న పాలమూరులో ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు ఏకబిగిన జరగనున్న ఈ యాత్రలో ఆమె, మొత్తం ఐదు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గుండెపోటుతో మరణించిన 16 మందికి చెందిన కుటుంబాలను ఈ పర్యటనలో ఆమె పరామర్శిస్తారు. పాలమూరు జిల్లాలో యాత్ర పూర్తి అయిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఆమె పరామర్శ యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గతంలో ఓదార్పు యాత్ర పేరిట వైెఎస్ జగన్ చేపట్టిన ఈ యాత్ర ఖమ్మం జిల్లా తర్వాత ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తదుపరి యాత్రను షర్మిళ చేపడతారని ఆ పార్టీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News