: ఏపీకి రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. తుపాను నష్టం అంచనా వేసేందుకు బృందం పంపాలని ఆయన కేంద్రాన్ని కోరామన్నారు. విశాఖ పునర్నిర్మాణానికి సహాయం చేయాలని, చెన్నై కారిడార్ అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పేరుపై వివాదం లేదని, పాత పేరే పెట్టామన్న విషయాన్ని టీఆర్ఎస్ గుర్తించాలని బాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో పీవీ ఘాట్ కోసం కూడా పోరాడుతామని ఆయన వెల్లడించారు.