: మతాన్ని కించపరిచేలా ఫేస్ బుక్ లో పోస్టులు చేసిన ఇంజనీర్ అరెస్టు
నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తో ఒక మతాన్ని కించపరచేలా, రెచ్చగొట్టేలా పోస్టులు చేసిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు హైదరాబాదుకు చెందిన ఇంజనీర్ పీటర్ సన్ గోడిగా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామని, అతడికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు. ఓ మతాన్ని కించపరిచేలా ఫేస్ బుక్ లో కరపత్రాలు, చిత్రాలు పోస్ట్ చేశారని ఓ మతానికి చెందిన పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అతడిని సాక్ష్యాధారాలతో అరెస్టు చేశారు.