: సహాయక చర్యలను కూడా రాజకీయం చేస్తున్నారు: సోనియా
జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన భారీ వరదల కారణంగా చేపట్టిన సహాయక చర్యలపై కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ లోని బందిపొరా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, కేంద్రం ఎన్నో హామీలు చేస్తోందని, ఒక్కదాన్ని కూడా ఆచరణలోకి తేవడం లేదని అన్నారు. భయంకర వరదల తరువాత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, సరైన నేతలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలకు సూచించారు. సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని ఆమె మండిపడ్డారు. యూపీఏ హయాంలో అభివృద్ధి పనులను సోనియా గుర్తు చేశారు.