: ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్మిత్?


బోర్డర్-గవాస్కర్ మొదటి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆడడం అనుమానంగా మారింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించే వ్యక్తిపై మాజీలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. క్లార్క్ తరువాత హడిన్ కు అవకాశం వస్తుందని అందరూ భావిస్తుండగా, అనూహ్యంగా యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ పేరు తెరపైకి వస్తోంది. ప్రతిభావంతుడిగా పేరొందిన స్టీవ్ స్మీత్ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లార్క్ వారసుడిగా స్మిత్ పనికొస్తాడో, లేదో తేల్చడానికి ఇదే సరైన సమయమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్టుకు క్లార్క్ దూరమైన పక్షంలో స్మిత్ కు జట్టు పగ్గాలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కిమ్ హగీస్, మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డారు. కాగా, ఆసీస్, టీమిండియా మధ్య తొలి టెస్టు డిసెంబర్ 4న బ్రిస్బేన్ లో ఆరంభం కానుంది.

  • Loading...

More Telugu News