: రైల్వేస్టేషన్ లో మంచు మనోజ్...ఫిల్మ్ నగర్ లో మంచు లక్ష్మి


టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మి మంచు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. హైదరాబాదు శివారు లింగంపల్లి రైల్వేస్టేషన్ ను శుభ్రం చేసిన సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, దేశానికి ఉపయోగపడే పత్రి పనికి తమ కుటుంబ మద్దతు ఉంటుందని తెలిపాడు. ప్రచార ఆర్భాటాల కోసం స్వచ్ఛ భారత్ ను వినియోగించుకోవద్దని మనోజ్ కోరాడు. కాగా, ఫిల్మ్ నగర్ లో మనోజ్ సోదరి లక్ష్మి మంచు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఫిల్మ్ నగర్ బస్తీ రోడ్లతో పాటు, ప్రభుత్వ పాఠశాల పరిసరాలను ఆమె శుభ్రం చేశారు.

  • Loading...

More Telugu News