: 'టైమ్' పత్రిక 25 ఉత్తమ ఆవిష్కరణల జాబితాలో మన 'మంగళ్యాన్'
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మంగళ్యాన్' టైమ్ పత్రిక 25 ఉత్తమ ఆవిష్కరణల జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా "తొలి ప్రయత్నంలోనే ఎవరూ 'మార్స్' యాత్రలో విజయం సాధించలేదు. అమెరికా, రష్యా, యూరోపియన్ దేశాలు ఆ ఘనతను దక్కించుకోలేకపోయాయి. కానీ, సెప్టెంబర్ 24న భారత్ చేసి చూపింది. ఆ రోజున మంగళ్యాన్ అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించినప్పుడు, ఆ సాంకేతిక ఘనత ఏ ఆసియా దేశం సాధించనిదిగా నిలిచింది" అని టైమ్ ప్రతిక పేర్కొంది.