: ఎర్రచందనం వేలంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ లో వివిధ సందర్భాలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల వేలంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, ఈ విషయమై స్పందించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటిసులు జారీ చేశారు. దీంతో, సోమవారం నాడు ప్రారంభమైన వేలం ప్రక్రియకు మార్గం సుగమమైంది.