: ఎన్టీఆర్ పేరును ఆంధ్రాలో బస్టాండులకు పెట్టుకోవాలంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
శంషాబాద్ ఎయిర్ పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడం వివాదాస్పదం కావడం తెలిసిందే. తెలంగాణ నేతలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా నేతల పేర్లు పెట్టడం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ పేరును ఆంధ్రాలోని బస్టాండులకు, ఎయిర్ పోర్టులకు పెట్టుకోవాలని సూచించారు. అంతేగాకుండా, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొమురం భీం పేరు పెట్టాలన్నారు.