: బతికుండగానే చంపారు ... వార్తా చానళ్ల 'అతి' ఉత్సాహం!
ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసే వార్తల్లో కచ్చితత్వం లోపిస్తోందన్నది ఎన్నాళ్ల నుంచో వినవస్తున్న మాట! చానళ్ల వైఖరికి ఈ ఘటనను ప్రబల నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బెంగళూరులోని గిరినగర్ వార్డు కౌన్సిలర్ హెచ్ఎస్ లలిత రెండు నెలలుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదు. అయినాగానీ, టీవీ చానళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయి. తొలుత 'పరిస్థితి విషమం' అని ప్రసారం చేశాయి. ఆ మరుసటిరోజు ఏకంగా చనిపోయిందని ప్రకటించేశాయి, ఓ వైపు ఆమె నిక్షేపంగా ఉండగానే! అంతటితో ఆగలేదా వార్తా స్రవంతికలు! మృతదేహం ఇంటికి చేరుకుందంటూ న్యూస్ బ్రేక్ చేశాయి. కొన్ని గంటల తర్వాత తప్పు తెలుసుకుని, ఆ 'చావు' వార్తలకు సమాధి కట్టేశారు.