: స్పీకర్‌తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితో టీటీడీపీ ఎమ్మెల్యేలు నేటి మధ్యాహ్నం సమావేశమయ్యారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)కి తమ పార్టీ నుంచి ఒక్కరినే ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మైహోమ్ సంస్థకు భూ కేటాయింపుల ఫైళ్లను ప్రభుత్వం మీ ముందు పెట్టిందా? అని స్పీకర్‌ను ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు సమాచారం. విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాట నిలుపుకోవాలని, ఈ దిశగా స్పీకర్ ఒత్తిడి చేయాలని వారు సూచించారు.