: కాశ్మీర్లోని ఆసుపత్రుల కోసం సైన్యం రక్తదానం
కాశ్మీర్లో ఇటీవలి వరదల తరువాత ఆసుపత్రులలోని రక్త నిల్వలు ఖాళీ అవడంతో సైన్యం స్పందించింది. ఓ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 1370 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ఎన్ జోషి తెలిపారు. ఈ తరహా 6 బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఇప్పటికే నిర్వహించామని ఆయన వివరించారు. రక్త నిల్వలను పెంచడంలో సైన్యం ఎల్లప్పుడూ ముందు నిలుస్తుందని ఆయన అన్నారు.