: సోనియా అల్లుడి ఆస్తులు, కంపెనీల వివరాలు కోరిన హర్యానా సర్కార్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీల, ఆస్తుల పూర్తి వివరాలు ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం గుర్గావ్ పరిపాలన కార్యాలయాన్ని కోరింది. ఈ మేరకు వాద్రాకు సంబంధించిన మొత్తం వివరాలు సమర్పించాలని తనను అడిగినట్టు గుర్గావ్ జిల్లా మేజిస్ట్రేట్ కమ్ డిప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థికి ల్యాండ్ రికార్డుల డైరెక్టర్ లేఖ రాశారు. దాంతో, స్పందించిన కమిషనర్ శేఖర్, వారం రోజుల్లో ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి తర్ సెమ్ శర్మను ఆదేశించారు.