: థానే రైల్వే స్టేషన్లో ఏసీ టాయిలెట్... దేశంలోనే ప్రథమం
దేశంలోనే తొలిసారిగా భారత రైల్వే థానే స్టేషన్లో ఏసీ టాయిలెట్ ను ఏర్పాటు చేసింది. శనివారం దీనికి ప్రారంభోత్సవం జరగనుంది. దీంట్లో పురుషుల విభాగంలో 30 యూరినల్స్, 4 లెట్రిన్లు... మహిళలకు 6 వాటర్ క్లోజెట్ సెక్షన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. కాగా, రద్దీ ఎక్కువగా ఉండే థానే స్టేషన్ లో ప్రస్తుతం 3 టాయిలెట్లు ఉన్నాయి. తదుపరి, ఏసీ టాయిలెట్ సౌకర్యాన్ని డోంబివ్లి స్టేషన్లోనూ ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే అధికారి తెలిపారు.