: అది లగడపాటికి అవసరం... నాకెందుకు?: పెప్పర్ స్ప్రేపై మోత్కుపల్లి


టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం కేబీఆర్ పార్కు వద్ద నవ్వులు పూయించారు. పెప్పర్ స్ప్రేను విక్రయించేందుకు ఓ సేల్స్ మన్ తన వద్దకొచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడి వారిని కడుపుబ్బా నవ్వించాయి. పార్కు వద్ద రెండు రోజుల క్రితం నిత్యానందరెడ్డిపై జరిగిన దాడిని పురస్కరించుకుని పెప్పర్ స్ప్రేను విక్రయించేందుకు వచ్చిన సేల్స్ మన్ తో మోత్కుపల్లి సరదా వ్యాఖ్యలు చేశారు. "అది లగడపాటికి అవసరం గాని... నాకెందుకు? నేనే ఓ పెద్ద పెప్పర్ స్ప్రేను. నా మీద ఎవరు దాడి చేస్తారు?" అంటూ ఆయన తనదైన శైలిలో చెప్పుకుపోయారు. దీంతో సేల్స్ మన్ సహా అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

  • Loading...

More Telugu News