: టీటీడీ ఉద్యోగుల ధర్నా
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అకారణంగా, అన్యాయంగా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారంటూ టీటీడీ ఈవో, విజిలెన్స్ అధికారుల తీరుపై మండిపడ్డారు. సస్పెన్షన్లు ఎత్తి వేసేంతవరకు, తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని ఉద్యోగ సంఘం నేతలు హెచ్చరించారు.